కరోనా మహమ్మారి బారినపడి మృతిచెందినవారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. కోవిడ్ సోకి మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపింది.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధుల నుంచి ఈ పరిహారం అందజేయనుండగా.. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది తెలంగాణ సర్కార్.. ఇక, కోవిడ్ డెత్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది ప్రభుత్వం.. మృతుల కుటుంబ సభ్యుల ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది..…
చైనాలో పుట్టిన కరోనా వైరస్ రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడీస్తోంది. చౌకగా వస్తువులను అమ్మకానికి పెట్టినంత ఈజీగా చైనా కరోనాను కూడా ప్రపంచ దేశాలకు అతి తక్కువ సమయంలోనే ఎగుమతి చేసింది. ఇంకేముంది.. ప్రపంచ దేశాలన్నీ కరోనా బారిన పడటంతో కోట్లాది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ అయితే పేకమేడలా కుప్పకూలిపోయింది. దీంతో చాలామంది నడిరోడ్డున పడాల్సి వచ్చింది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయట పడుతోంది.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు.. గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిషా రాష్ట్రానికి చెందిన కూలీల మృతిపై మావనతాదృక్పథంతో స్పందించిన సీఎం.. మృతి చెందిన ఆరుగురు కూలీలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి మన రాష్ట్రానికి వచ్చి అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతా దృక్పథంతో సాయం అందించాలన్నారు సీఎం.. ఇక,…