Europa Clipper Probe: సౌరకుటుంబంలో గ్రహాలకు పెద్దన్న బృహస్పతి(గురుడి) వద్దకు నాసాకు చెందిన ‘‘యూరోపా క్లిప్పర్ ప్రోబ్’’ ప్రయాణం మొదలైంది. సోమవారం ఫ్లోరిడా నుంచి అంతరిక్ష నౌక బయలుదేరింది. 2.9 బిలియన్ కిలోమీటర్ల దూరంలోని గురుడిని చేరుకోవడానికి అంతరిక్ష నౌక ఏకంగా 5.5 ఏళ్ల పాటు ప్రయాణించనుంది. 2030 నాటికి జూపిటర్ కక్ష్యలోకి చేరుకుంది. నిజానికి ఈ ప్రయోగం గత వారం ప్లాన్ చేసినప్పటికీ.. మిల్టన్ హరికేన్ కారణంగా నిలిపేయబడింది.
12 new moons found around Jupiter: గురు గ్రహం సౌరవ్యవస్థలో సూర్యుడి తర్వాత అతిపెద్ద గ్రహం. సైన్స్ ప్రకారమే కాకుండా.. పురాణాల్లో, జోతిష్య శాస్త్రంలో గురుగ్రహానికి ప్రముఖ స్థానం ఉంది. శుభాలకు కారకుడిగా బృహస్పతి గ్రహాన్ని భావిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా గురు గ్రహం చుట్టూ తిరుగుతున్న 12 కొత్త చంద్రులను కనుక్కున్నారు.