ఏపీలో విద్యుత్ కోతలు, పవర్ హాలిడే అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. పవర్ హాలిడే ఎత్తేయాలని లోకేష్ కోరారు. పవర్‌లో వున్న మీరు పవర్ హాలీడే ప్రకటించడం చాలా సులువే. కానీ ఆ ప్రకటన చేసే ముందు కనీసం ఒక్క క్షణం రాష్ట్ర పరిస్థితి ఆలోచించారా? మొన్నటి వరకు కరోనా కష్టాలతో నష్టాల్లో నడిచిన పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కాస్త గాడినపడి పుంజుకుంటుంటే పవర్ హాలిడే…