Godavari Floods: గోదావరి ఉగ్రరూపంతో అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో వరద భయం నెలకొంది. కూనవరం, శబరి - గోదావరి సంగమం వద్ద నీటిమట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. ఇళ్లల్లోని సామగ్రితో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.