Lightning strikes: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులపాటు కారణంగా ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురు మరణించారు. బుదౌన్, ఇలాహ్, రాయ్ బరేలీ జిల్లాల్లో పిడుగుపాటు ఘటనలు నమోదయ్యాయి. గురువారం వివిధ ప్రాంతాల్లో జరిగిన పిడుగుపాటు ఘటనల వల్ల ఏడుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. యూపీకి చెందిన ఓ డాక్టర్ అనేక మంది పేషెంట్లకు ఒకే సిరంజిని వాడాడు. ఆ తరువాత ఓ అమ్మాయికి హెచ్ఐవీ పాజిటివ్ గా తేలింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఎటాహ్ లోని ఒక వైద్య కళాశాల వైద్యులు ఒకే సిరంజితో అనేక మందికి ఉపయోగించారు. అయితే ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ స్పందించారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.