CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.. దేశంలోని ప్రముఖ ఆర్థిక దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సీఎం చంద్రబాబుకు ప్రకటించింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాలు అమలు చేయడం, పారిశ్రామిక సంస్కరణలు చేపట్టడం, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంలో విశేష కృషి చేసినందుకుగానూ ఈ అవార్డును ఎంపిక చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. మార్చి నెలలో నిర్వహించనున్న…