నడిరోడ్డు మీద జన వాహనాలని హటాత్తుగా ఆపించి, తలెత్తించి పోస్టర్లకేసి చూస్తూ నిలబెట్టించి, ఆ జనవాహినిని సినిమాహాలు క్యూలో నిలబడేలాచేసి, వేలాది సినిమాలను వందరోజులదాకా నడిపించి, కళని పోస్టర్ పోట్రెయిట్ స్థాయికి పెంచి చూపిన ‘కళా మాంత్రికుడు’….ప్రకటనా చిత్రకళలో గురుస్థానాధిష్టుడు అని బాపు, రమణల ప్రశంసలు అందుకున్న ఈశ్వర్ అనబడే కొసనా ఈశ్వరరావు వివిధ భాషల సినిమాలకు పబ్లిసిటీ డిజైన్లు రూపొందించిన అపర ‘రాజా రవివర్మ’. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ సినిమాలకు ప్రచార డిజైన్లు…