పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి అంబటి రాంబాబు సరైన సమాధానం చెప్పడం లేదని, చెప్పేదంతా తప్పుల తడకగా ఉందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. డయా ఫ్రమ్ వాల్ ను చంద్రబాబు కడితే దానిని ఏమి చేయాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంది. ప్రాజెక్ట్ పై ఎందుకు నిపుణులతో పరిశీలన చేయడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఒక కాంట్రాక్టర్ ను పెట్టుకున్నారు. గతంలో ప్రభుత్వం ఒక కాంట్రాక్టర్ ను పెట్టుకుంది.…