Sunspot: సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్‌లో చివరి దశలకు చేరుకున్నాడు. దీంతో సూర్యుడి ఉపరితలం క్రమంగా అలజడిగా మారుతోంది. గతంలో పోలిస్తే ప్రస్తుతం సన్‌స్పాట్స్, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వంటి విషయాలు ఎక్కువ అవుతున్నాయి. సూర్యుడిపై ఏర్పడే భారీ పేలుళ్ల కారణంగా పదార్థం అంతరిక్షంలోకి వెదజల్లబడుతోంది. దీని కారణంగా భూమిపై సౌరతుఫానులకు ఏర్పడుతున్నాయి.
Jupiter: సౌరకుటుంబంలో అతిపెద్ద గ్రహం, భారీ వాయుగోళం గురుగ్రహంపై మరోసారి ఫ్లాష్ లైట్ కనిపించింది. ఎప్పుడు చూడని విధంగా ఈ ఫ్లాష్ ఉంది. ఇలాగే గతంలో అంతరిక్ష వస్తువులు గురుగ్రహంలో కూలిపోవడంతో భారీ వెలుగులు కనిపించాయి. తాజా నమోదైన ఈ వెలుగు, ఇది వరకు ఎప్పుడూ చూడని విధంగా ఉందని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. ఆగస్టు 28న ఇది రికార్డ్ అయింది.