Indrakeeladri: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల సమయానికి సుమారు 85 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 10 రోజుల్లో మొత్తం 11 లక్షల 28 వేల 923 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ తెలిపారు.