ఇప్పుడు భారత చిత్రసీమలోని భాషా బేధాలు పూర్తిగా తొలగిపోయిన సంగతి తెలిసిందే! అక్కడి దర్శకులు ఇక్కడి హీరోలతోనో, ఇక్కడి దర్శకులు అక్కడి హీరోలతోనో జత కట్టేస్తున్నారు. ముఖ్యంగా.. టాలీవుడ్, కోలీవుడ్‌లో ఈ క్రేజీ కాంబోలో బోలెడన్నీ కుదిరాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కలయిక చేరనున్నట్టు కనిపిస్తోంది. అదే.. డైరెక్టర్ హరి, మన మ్యాచో మ్యాన్ గోపీచంద్. తమిళ దర్శకుడు హరి ఎప్పట్నుంచో తెలుగులో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా.. సింగం సిరీస్‌తో తనకు తెలుగులోనూ మంచి…