2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నాడు తన రిటైర్మెంట్‌పై మోర్గాన్ ప్రకటన చేసే అవకాశముంది. త్వరలోనే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని మోర్గాన్ తొలుత భావించినా ప్రస్తుతం రిటైర్మెంట్ తీసుకోవడానికే అతడు ప్రయత్నిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతుండటం, పేలవ ఫామ్ వంటి అంశాల కారణంగా మోర్గాన్ ఈ…
క్రికెట్‌లో క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్. టీ 20 బ్లాస్ల్ క్రికెట్‌లో భాగంగా యార్క్‌షైర్, లంకాషైర్ మధ్య మ్యాచ్ జరిగింది. లంకాషైర్ ఇన్నింగ్స్‌లో లూక్ వెల్స్ మిడాఫ్ మీదుగా షాట్ ఆడి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న స్టీవెన్ క్రాప్ట్‌కు కాల్ ఇచ్చాడు. అయితే క్రాప్ట్ రన్ కోసం యత్నించి మధ్యలోనే పడిపోయాడు. కాలు పిక్క పట్టేయడంతో క్రాప్ట్ నొప్పితో విలవిల్లాడాడు. అప్పటికే బాల్ కీపర్ హ్యారీ డ్యూక్ చేతిలోకి వచ్చింది. బ్యాట్స్‌మన్ రనౌట్‌కు అవకాశమున్నా…