ఖలిస్థాన్ వేర్పాటువాది అమృతపాల్ సింగ్, అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు షేక్ అబ్దుల్ రషీద్ శుక్రవారం ఎంపీలుగా ప్రమాణం చేశారు. స్పీకర్ ఛాంబర్‌లో ఓం బిర్లా వీరిద్దరి చేత ప్రమాణం చేయించారు. పెరోల్‌పై వచ్చి లోక్‌సభ ఎంపీలుగా ప్రమాణం చేశారు.
తాజాగా వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఊహించని విధంగా స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. జైలు నుంచి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు విక్టరీ సాధించారు. దీంతో దేశ వ్యాప్తంగా వీరిద్దరి గురించి చర్చ జరుగుతోంది.