Fire Accident : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ PVNR ఎక్స్‌ప్రెస్ వే పై ఒక కారు లో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. అత్తాపూర్ 151 పిల్లర్ నెంబర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. టాటా క్వాలీస్ కారు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే కిందకు దిగిపోయాడు. దీంతో అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగాడు. క్షణాల వ్యవధిలోనే కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి…