శ్రీశైలం దేవస్థానంలో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల స్థానిక అంతర్గత బదిలీలు జరిగాయి.. ఏకంగా 95 మంది ఉద్యోగులను అంతర్గత బదిలీ చేస్తూ ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.. దీంతో, శ్రీశైలం దేవస్థానంలో 95 మంది ఉద్యోగులకు స్థానచలనం కలిగినట్టు అయ్యింది.
ఉద్యోగుల బదిలీల గడువును మరోసారి పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 22 తేదీ వరకు గడువును పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, సెప్టెంబర్ 23 తేదీ నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.. ఎక్సైజ్ శాఖ బదిలీల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.. అక్టోబర్ 1 తేదీన ఆ శాఖ బదిలీల్లో నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మరో 15 రోజుల గడువు పొడిగించింది.. వచ్చే నెల (సెప్టెంబర్) 15వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేసింది.. అయితే, వచ్చే నెల 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్..
సాధారణ బదిలీల నుంచి తప్పించుకునేందుకు పక్కదారి పడుతోన్నారు పలువురు ఉద్యోగులు. బదిలీల నుంచి వెసులుబాటు కోసం వివిధ సంఘాల నుంచి ఆఫీస్ బేరర్ల లెటర్లు తీసుకుంటున్నారట పలువురు ఉద్యోగులు. ఆఫీస్ బేరర్లు కాకున్నా కొన్ని ఉద్యోగ సంఘాలు లేఖలు ఇచ్చేస్తోన్నట్టు గుర్తించిన ప్రభుత్వం.. అనర్హులకు లేఖలు.. ఫేక్ ఆఫీస్ బేరర్ల లెటర్లపై సీరియస్ అయ్యింది..
Employee Transfer: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలపై కసరత్తు కొనసాగుతుంది. విద్య, వైద్య శాఖలు మినహా 15శాఖల్లో బదిలీలు కొనసాగనున్నాయి. పైరవీలు, అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీలు చేపట్టాలని మంత్రులు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.