ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ రచ్చ పతాక స్థాయికి చేరుకుంది. ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం విజయవాడలో టెన్షన్ వాతావరాణాన్ని నెలకొల్పింది. మరోవైపు ఛలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించగా.. ఉద్యమం నిర్వహించి తీరుతామని పీఆర్సీ సాధన సమితి ప్రకటించింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల ఆంక్షలు విధించారు. ఛలో విజయవాడకు వస్తున్న ఉద్యోగులను ఎక్కడిక్కకడే పోలీసులు…