Amazon: టెక్ లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా, అమెజాన్ 14,000 మంది ఉద్యోగుల్ని తీసేసింది. దీనిపై అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ స్పందించారు. ఉద్యోగుల తొలగింపు ‘‘ వర్క్ కల్చర్’’కు సంబంధించిందని చెప్పారు. తొలగింపులు AI కోసం, డబ్బు కోసం కాదని ఆయన స్పష్టం చేశారు.