సుప్రీంకోర్టులో న్యాయవాదుల నుంచి న్యాయమూర్తుల వరకు అందరూ ఒక 12 ఏళ్ల బాలిక మాటలు విని విస్తుపోయారు. ఆ బాలిక తండ్రితో కలిసి జీవించడానికి రూ.1 కోటి డిమాండ్ చేయడంతో షాక్ అయ్యారు. వాస్తవానికి దంపతుల మధ్య వివాదానికి సంబంధించిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ఈ పిటిషన్‌ను విచారించారు. ఆ బాలిక చెప్పిన మాటలు విని ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే అమ్మాయి తల్లిని మందలించారు.