జబర్దస్త్ ఫేమ్ యాదమ్మ రాజు, ఇమాన్యుయేల్ వంటి యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్స్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సరికొత్త చిత్రం ‘భూతం ప్రేతం’. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ మరియు పోస్టర్లతో క్యూరియాసిటీ పెంచిన చిత్ర యూనిట్, తాజాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రేక్షకులకు అదిరిపోయే మ్యూజికల్ ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి ‘చికెన్ పార్టీ’ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పేరుకు తగ్గట్టుగానే ఈ పాట ఫుల్ పార్టీ…