రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా పెను విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర బౌరింగ్, లేడీ కర్జన్ ఆస్పత్రికి చేరుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర మాట్లాడుతూ.. "ఈ విషాదానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. మొత్తం దేశం, కర్ణాటక ఆర్‌సీబీ…