ట్విటర్ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతుల్లోకి వచ్చేసింది. 44 బిలియన్ డాలర్లు చెల్లించి ఆయన ఈ కంపెనీని సొంతం చేసుకున్నారు. దీంతో త్వరలోనే ఆయన ట్విట్టర్ సంస్థను తన అధీనంలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం మస్క్ చేతిలోనే ట్విట్టర్ సంస్థ పాలనా పగ్గాలు ఉండనున్నాయి. ఎలాన్ మస్క్ కొనుగోలుతో ట్విట్టర్ షేర్ హోల్డర్ల పంట పండినట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తాజా పరిణామాలతో ట్విట్టర్ షేర్ల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. కార్పొరేట్ దిగ్గజంగా ఎదగడంతో…