Special Story on Solar Power in India: మన దేశంలో సరికొత్త సౌర చరిత్ర ప్రారంభమైంది. దీంతో.. కరంట్ కోసం భవిష్యత్తులో బొగ్గు పైన మరియు శిలాజ ఇంధనాల పైన ఆధారపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఈ సంవత్సరంలోని మొదటి 6 నెలల్లో ఇండియా.. సోలార్ పవర్ జనరేషన్ ద్వారా 4.2 బిలియన్ డాలర్ల ఇంధన ఖర్చును తగ్గించుకోగలిగింది. 19.4 మిలియన్ టన్నుల బొగ్గును కూడా ఆదా చేసుకుంది.