రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై సీఎం విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం…
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ కు ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రూ.8 కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా ఏ క్షణమైనా సీజ్ చేస్తామని మాల్ ఎదుట మైక్ లో అనౌన్స్ చేశారు అధికారులు. దీంతో.. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారస్తులకు ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో.. మాల్ వ్యాపారంలో అయోమయంలో ఉన్నారు. మరోవైపు.. మాల్ ను స్వాధీనం చేసుకునేందుకు ఆర్టీసీ అధికారులు సిద్దమవుతున్నారు.