టీఆర్ఎస్ పార్టీలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు. దీంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. హూజూరాబాద్ ఉప ఎన్నికను ఈటల రాజేందర్ తోపాటు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ పొలిటికల్ హీట్ మొదలైంది. కాంగ్రెస్ సైతం హుజురాబాద్ వేదికగా తమ సత్తా చూపించేందుకు రెడీ అవుతుంది. ఈ ఎన్నిక ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.…