ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో నేతలు ప్రచారాలను తమదైన శైలిలో ప్రారంభిస్తున్నారు. వైనాట్ 175 దిశగా ఈ సారి ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే రీతిలో ప్రజలను ఆకట్టుకోవాలని నేతలు భావిస్తున్నారు.
సంక్రాంతి తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లనున్నారు. ఈ నెల 25 నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఈ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. రోజుకు రెండు జిల్లాల చొప్పున సీఎం పర్యటించనున్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు మజీద్‌ల వద్ద శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముస్లిం సోదరులను కలిశారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉందని.. మీకు అండగా నిలిచిన పార్టీని, ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు.
నేడు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుమార్తె స్ఫూర్తి ఇంటింటి ప్రచారం నిర్వహించి రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు.