హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచార పోరు నడుస్తోంది. ఉప ఎన్నికకు సమయం ముంచుకువస్తుండటంతో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ తమ అధినేత కేసీఆర్‌తో సభలు నిర్వహించేలా ప్రణాళికలు రచించింది. ఈనెల 27న హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట గ్రామంలో కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం హుజురాబాద్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు వీలు లేకపోవడంతో ఈ…