దేశంలోని పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీలోని బద్వేల్, తెలంగాణలోని హుజురాబాద్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కోడ్ ఉల్లంఘనలు జరుగుతుండటంపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గంపై ప్రభావం చూపేలా పక్క నియోజకవర్గాలలో పలు రాజకీయ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. Read Also: బద్వేల్ ఉపపోరు…ఆ రెండు పార్టీలకు షాక్…