మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. సినిమాను తలపించేలా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎలాంటి అనుమానాలు రాకుండా శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే పార్టీలో చీలిక తీసుకువచ్చాడు. ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేలలోని 38 మందితో పాటు 8 మంది స్వతంత్రులు ఏక్ నాథ్ షిండే క్యాంపులో ఉన్నారు. గుజరాత్ సూరత్ నుంచి అస్సాం గౌహతికి రెబెల్ నేతలు క్యాంప్ మార్చారు. మరోవైపు మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు తమ మహావికాస్ అఘాడీ…