CS Shanti Kumari : తెలంగాణ “ప్రజా ప్రభుత్వం” మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న హైదరాబాద్‌లో ప్రజా విజయోత్సవం లేదా “ప్రజాపాలన విజయోత్సవం” ప్రారంభం కానుంది. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ ప్రారంభోత్సవ వేడుకలో సుమారు 14,000 మంది పాఠశాల విద్యార్థులు హాజరైన విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యాపరమైన మద్దతును…
గత పదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని, ప్రజా ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులతో సీఎం ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు.