దేశాభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థల్లో విద్యాబోధన జరగాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పరిశ్రమలకు ఏం అవసరమో భారతదేశం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పరిశ్రమలోకి ప్రవేశించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న విద్యార్థులను విద్యా సంస్థలు ఉత్పత్తి చేయాలని సూచించారు.