Bhatti Vikramarka : రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్ సర్వీసెస్ మెయిన్స్, ఇంటర్వ్యూ లకు ఎంతమంది ఎంపికైనా ఆర్థిక సహాయం అందిస్తాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన ప్రజా భవన్ లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన 50 మందికి చెక్కులు అందించిన అనంతరం ప్రసంగించారు. సివిల్ సర్వీసుల్లో విజయం సాధించి రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని తపిస్తున్న అందరికీ అభినందనలని డిప్యూటీ సీఎం…