BYJUS : ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ కష్టతరమైన సమయాలను ఎదుర్కొంటోంది. అయితే కంపెనీ సీఈవో సహ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ తన ఉద్యోగులకు జనవరి నెల జీతాన్ని చెల్లించారు.
ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విదేశీ నిధుల చట్టాలు (ఫెమా) ఉల్లంఘించినందుకు రూ.9000 కోట్లు చెల్లించాల్సిందిగా ఆ సంస్థకు ఈడీ నోటీసులిచ్చినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి.