రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు, కరెంట్ కోతలకు నిరసనగా టీడీపీ నిరసనలు ఉధృతంగా సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం, నియోజకవర్గంలోని వివిధ మండలాలలో పలు గ్రామాల్లో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బాదుడే బాదుడు పేరుతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో పన్నులు నిత్యావసర ధరల పెంపుపై టీడీపీ విన్యూత్నరీతిలో నిరసనలు చేపట్టింది. పాలకొల్లు నియోజకవర్గంలో పెంచిన పన్నులు, నిత్యావసర ధరల పెంపుపై ఈ ప్రభుత్వం బాదుడే బాదుడును ఇంటింటికీ కార్యక్రమం…
ఏపీలో వంటనూనెల ధరలు సామాన్యులను ఠారెత్తిస్తున్నాయి. వ్యాపారులు ఉక్రెయిన్ యుద్ధం వంక పెట్టి ధరలు పెంచేస్తున్నారు. వంట నూనెల ధరల నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమీర్ శర్మ సమీక్ష చేపట్టారు. వంట నూనెల ధరల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశాలిచ్చారు. వంట నూనెల ధరల పెరుగుదల నియంత్రణకు కలెక్టర్లు, జేసీలు, పౌరసరఫరాలు, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తదితర విభాగాల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో హోల్…