బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించి, థియేటర్లలో సంచలన విజయం సాధించిన హారర్-థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ అనుభూతిని పంచింది. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ, భారతదేశపు అతిపెద్ద స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5లో డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 17వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి…