టాలీవుడ్ మళ్లీ డ్రగ్స్ కేసుతో కుదిపేస్తోంది. డ్రగ్స్ కొనుగోలు, సప్లై వ్యవహారంలో ప్రముఖ సినీ నటులు శ్రీరామ్ (శ్రీకాంత్), కృష్ణ పేర్లు బయటకు రావడంతో సంచలనం రేగింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వీరిద్దరికీ సమన్లు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. గత జూన్‌లో ప్రదీప్ కుమార్ అనే వ్యక్తికి మత్తు పదార్థాలు సప్లై చేసినందుకు జాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతని వద్ద నుంచి లభించిన వివరాల…