Donald Trump Kamala Harris: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు 23 మంది నోబెల్ బహుమతి ఆర్థికవేత్తల మద్దతు లభించింది. ఈ ఆర్థికవేత్తలు కమలా హారిస్‌ను ఉద్దేశించి లేఖలు రాశారు. ఆర్థిక వ్యవస్థపై కమలా హారిస్ విధానాలను 228 పదాల లేఖలో ఆర్థికవేత్తలు ప్రశంసించారు. కమలా హారిస్ విధానాలు చాలా బాగున్నాయన్నారు. జూన్ నెల ప్రారంభంలో, 15 మంది నోబెల్ బహుమతి ఆర్థికవేత్తలు అధ్యక్షుడు జో బిడెన్‌ను ప్రశంసించారు.…