శ్రీలంక సంక్షోభం మరింతగా ముదురుతోంది. ఒక్కొక్కరుగా నాయకులు రాజీనామాలు చేస్తున్నప్పటికీ.. ప్రజల ఆందోళనలు, నిరసనలు ఏమాత్రం తగ్గడం లేదు. నిరసనకారులు నేతల ఇళ్లను, వారికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేస్తూ.. ఆందోళనలు చేస్తున్న క్రమంలోనే ఇప్పటికే అనేక మంది నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. శ్రీలంక అధ్యక్షుడి సోదరుడు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించాడు. దీనిని ముందుగానే గుర్తించిన విమానాశ్రయ అధికారులు, ప్రయాణికులు ఆయనను అడ్డుకున్నారు. ఈ నెల 13న అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేస్తారనీ.. ఆ తర్వాత అన్ని…
దేశంలో ధరలు మండిపోతున్నాయి. చమరు సెగ ఓవైపు, గ్యాస్ రేటు మరోవైపు భయపెడుతున్నాయి. ఇవి చాలదన్నట్టు నిత్యావసరాలు కూడా రోజుకో రకంగా పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం కూడా వణికిస్తోంది. ప్రజల కొనుగోలు శక్తి కూడా పడిపోయిందని ఎఫ్ఎంసీజీ కంపెనీల నివేదిక చూస్తుంటే.. మాంద్యం ముంచుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవే పరిస్థితులున్నాయి. 2008 నాటి మాంద్యం కాదు.. 1930 నాటి మహామాంద్యం తరహా ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు అన్ని దేశాల్నీ అల్లాడిస్తున్నాయి. అమెరికా నుంచి ఆఫ్రికా…