Ebola outbreak in Uganda: ఉగాండాలో ఎబోలా కలకలం రేపుతోంది. ఆ దేశంలో వరసగా ఎబోలా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా రాజధాని కంపాలాలో కొత్తగా 9 ఎబోలా కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజుల్లో మొత్తం 14 కేసులు నమోదు అయ్యయాని అక్కడి ఆరోగ్య మంత్రి సోమవారం తెలిపారు. సెప్టెంబర్ నెలలో సెంట్రల్ ఉగాండాలోని గ్రామీణ ప్రాంతంలో ఎబోలా వ్యాప్తి ప్రారంభం అయింది. ఈ నెలలో రాజధాని కంపాలాకు ఈ వ్యాధి వ్యాపించింది. 16 లక్షల…
Ebola outbreak in Uganda: ఆఫ్రికా దేశం ఉగాండాలో ఎబోలా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఆ దేశంలో ఎబోలా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటోంది. ఎబోలా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రెండు జిల్లాల్లో పూర్తిగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని. ఈ రెండు జిల్లాలో రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో జనాల కదలికను నిషేధిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.