Ebola outbreak: ఉగాండాలో “ఎబోలా” కల్లోలం.. లాక్‌డౌన్ విధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ebola outbreak in Uganda: ఆఫ్రికా దేశం ఉగాండాలో ఎబోలా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఆ దేశంలో ఎబోలా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటోంది. ఎబోలా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రెండు జిల్లాల్లో పూర్తిగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని. ఈ రెండు జిల్లాలో రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో జనాల కదలికను నిషేధిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.
సెప్టెంబర్ 20న మొదటిసారిగా ఎబోలా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఆ దేశంలో 19 మరణాలు నమోదు కాగా..58 కేసులు ధృవీకరించబడ్డాయి. ముబెండే, కస్సాండా జిల్లాల్లో వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ రెండు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు. 15 లక్షల జనాభా ఉన్న రాజధాని కంపాలాకు ఈ రెండు జిల్లాల నుంచి ప్రజలు రాకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రయాణాలు నిషేధించడంతో పాటు మార్కెట్లు, బార్లు, చర్చిలను 21 రోజుల పాటు మూసేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
Read Also: Colombia: కొలంబియాలో ఘోర ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఇప్పటికే సరుకులు తీసుకెళ్లిన ట్రక్కులు ఈ రెండు ప్రాంతాల నుంచి బయటకు రావడానికి అనుమతించారు. ఇక మీదట ఈ ప్రాంతంలోకి రవాణాను నిషేధించారు. ఎబోలా వ్యాప్తిని అరికట్టడానికి సాంప్రదాయ చికిత్స చేస్తున్నవారు చికిత్సను నిలిపివేయాలని ఆదేశించారు అధ్యక్షుడు. వైరస్ బారిన పడిన అనుమానిత వ్యక్తుల ఐసోలేషన్ లోకి వెళ్లేందుకు నిరాకరిస్తే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
ఎబోలా వైరస్ శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. జ్వరం, వాంతులు, రక్తస్రావం, విరేచనాలు లక్షణాలుగా ఉంటాయి. చివరిసారిగా 2019లో ఉగాండాలో ఎబోలా మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం నమోదు అవుతున్న కేసులుకు సూడాన్ జాతి ఎబోలాగా పేర్కొంటున్నారు. 4.5 కోట్ల జనాభా ఉన్న ఉగాండాను ఈ వ్యాధి కలవరపెడుతోంది. మొదటిసారిగా ఎబోలా 1976లో దక్షిణ సుడాన్, కాంగోలో వ్యాప్తి చెందింది. ఎబోలా నదికి సమీపంలో ఈ వ్యాధి వ్యాపించడంతో దీనికి ఎబోలా అని పేరు పెట్టారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!