శరీరం దృఢంగా, బలమైన కండరాలు కలిగి ఉండాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఇందుకోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. దానికి తగినట్టుగా జిమ్‌కెళ్లి రకరకాల వ్యాయామాలు చేసి కష్టపడుతుంటారు.
కాల్షియం అనేది ఎముకల ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎముకలు పటిష్టంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి. ఇది గుండె పనితీరు, కండరాల పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది కండరాలు మరియు నరాల పనితీరుకు, రక్తపోటు.. హార్మోన్ స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.