పారిశుద్ధం పై ప్రత్యేక దృష్టి సాధించాలనీ, వర్షాకాలం లో సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శ జిల్లా గా తీర్చిదిద్దాలని పంచాయితీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ, గృహనిర్మాణ శాఖ ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క (అనసూయ) అధికారులను ఆదేశించారు. స్వచ్ఛధనం పచ్చదనం ప్రత్యేక 5 రోజుల కార్యక్రమంలో చేపట్టిన పారిశుద్ధ్య పనుల ప్రగతి పై సమీక్షించుకుని ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ గా కొనసాగాలని ఆన్నారు.…