మయన్మార్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 4.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. మయన్మార్ భూకంపం భారతదేశాన్ని కూడా కుదిపేసింది. మణిపూర్, నాగాలాండ్, అస్సాంతో సహా భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ప్రస్తుతానికి ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం.. భూకంపం మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు ఆగ్నేయంగా 27 కిలోమీటర్ల దూరంలో, మయన్మార్‌లోని భారత సరిహద్దుకు చాలా దగ్గరగా…
Ring of Fire: రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పం తూర్పు తీరానికి సమీపంలో శనివారం తెల్లవారుజామున 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇటీవల, రష్యాలో తరుచుగా భూకంపాలు, భూ ప్రకంపనాలు వస్తున్నాయి. శనివారం భూకంపం కారణంగా అధికారులు ‘‘సునామీ’’ హెచ్చరికలు చేశారు. సముద్ర గర్భంలో దాదాపుగా 10-20 కి.మీ లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
Earthquake in Los Angeles: అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. ఈ విషయాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జీఎస్) తెలిపింది. చైనాటౌన్ సమీపంలోని హైలాండ్ పార్క్‌కు దక్షిణ ఆగ్నేయంగా 2.5 మైళ్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 12:20 గంటలకు భూకంపం సంభవించింది. లాస్‌ఏంజిల్స్ ప్రాంతం నుంచి మెక్సికో సరిహద్దులోని శాన్‌డియాగో వరకు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో పలు ఇళ్లలోని…
Earthquake : దేశంలో మరోసారి భూమి కంపించింది. మణిపూర్‌లో ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.9గా నమోదైంది. మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో ఉదయం 6.56 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శుక్రవారం తెలిపింది.
Japan Earthquake : జపాన్‌లో సోమవారం 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు కనీసం ఆరుగురు మరణించారు. సోమవారం నాటి భూకంపానికి కేంద్రంగా ఉన్న జపాన్‌లోని ప్రధాన ద్వీపం హోన్షు పశ్చిమ తీరంలో ఉన్న ఇషికావా ప్రిఫెక్చర్‌లో అన్ని మరణాలు సంభవించాయి.
Nepal: ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అర్థరాత్రి బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం నేపాల్ లో ఉంది. దీని ప్రభావం ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కనిపించింది.