National Retail Trade Policy: దేశవ్యాప్తంగా ఉన్న చిల్లర వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త జాతీయ విధానాన్ని రూపొందిస్తోంది. ఇప్పటికే ఉన్న పాలసీలో పలు మార్పులు చేర్పులు చేయనుంది. వ్యాపారాన్ని మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని తీసుకురానుంది. దీంతో.. వర్తకులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, మరింత క్రెడిట్ పెరగనుంది. ఆన్‌లైన్ రిటైలర్లకు కూడా ఇ-కామర్స్ పాలసీని అందుబాటులోకి తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉంది.