ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా అపాయింట్‌మెంట్ తీసుకునేలా డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ను తీసుకొచ్చారు.