Delhi: ఢిల్లీలోని ద్వారకాలో 36 ఏళ్ల వ్యక్తి కరెంట్ షాక్‌తో మరణించాడు. అయితే, ఈ సంఘటనలో అతని భార్య, ఆమె ప్రియుడి కుట్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. మరణించిన వ్యక్తిని కరణ్ దేవ్‌గా గుర్తించారు. ఉత్తమ్‌నగర్‌లో మాతా రూప్రాణి మాగో ఆస్పత్రి నుంచి జూలై 13న పీసీఆర్ వచ్చినట్లు పోలీసులు చెప్పారు. వ్యక్తిని అతని భార్య, ఆమె లవర్ అయిన కరణ్ మామ కుమారుడు కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.