LTTE Prabhakaran: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించి చాలా ఏళ్లు గడుస్తున్నా.. ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల తమిళ నేత వైకో ప్రభాకరన్ జయంతి సభలో మాట్లాడుతూ.. ఇంకా టైగర్ ప్రభాకరన్ బతికే ఉన్నాడని, త్వరలో బయటకు వస్తారని కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ యువతి తాను ప్రభాకరన్ కూతురిని అని చెప్పుకునే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.