పోలీస్ శాఖలో ఇప్పుడు అక్రమార్కులు పుట్టుకొస్తున్నారనే ఆరోపణలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. అన్యాయాన్ని అరికట్టాల్సిన 'రక్షక భటులే భక్షక భటులుగా' మారుతున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ చేతులు చాచుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఎయిర్‌పోర్ట్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్, హోంగార్డు ఓ అడుగు ముందుకే అక్రమ దందా ప్రారంభించారు. అక్రమ సొమ్ముకు కక్కుర్తి పడి తమ స్థాయిని, బాధ్యత మరిచారు. కంచే చేను మేసినట్లు, అవినీతిపరుల ఆటకట్టించాల్సిన పోలీసులే అడ్డదారుల తొక్కారు. అసలేం జరిగిందంటే..