బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో చివరి అంకం ముగిసింది. విజయదశమి రోజున రాజరాజేశ్వరిదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం పూర్ణాహుతితో దసరా వేడుకలు ముగిశాయి. సాయంత్రం 5గంటల తర్వాత నగరోత్సవం నిర్వహించారు. కళావేదిక వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం నుంచి నగరోత్సవంలో భాగంగా దుర్గాఘాట్ వరకు ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. అనంతరం కృష్ణానదిలో హంసవాహనంపై గంగాపార్వతీ సమేత మల్లేశ్వరులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానదిలో నీటి…
విజయవాడ దసరా ఉత్సవాలకు కో ఆర్డినేషన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ద్రుష్ట్యా ఈ ఏడాది 30 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంది అని తెలిపింది. ఇక మూలానక్షత్రం రోజున కేవలం 70 వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 7 నుంచి 15 వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. దాంతో అన్ని శాఖలు అలెర్ట్ గా ఉండాలని సర్క్యులర్ జారీ చేసింది. దసరాలో అమ్మవారి…