కోలీవుడ్ హీరో ఆర్య కథానాయకుడిగా బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘సార్పట్ట’.. తుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘కబాలి’, ‘కాలా’ వంటి చిత్రాలు రూపొందించిన దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కాగా, తమిళ ట్రైలర్ విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటోన్న నేపథ్యంలో తాజాగా తెలుగు ట్రైలర్‌ను హీరో రానా దగ్గుబాటి తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. కె9 స్టూడియో పతాకంపై షణ్ముగం దక్షన్ రాజ్ ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా…