అయిదేళ్ల పాటు సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. 2023… బాలీవుడ్ గోల్డెన్ కి మళ్లీ తీసుకొని వచ్చింది, ఇందుకు మొదటి కారణం షారుఖ్ ఖాన్ మాత్రమే. తన పని అయిపొయింది అనే కామెంట్స్ వినిపిస్తున్న సమయంలో షారుఖ్ ఖాన్… 2023లో రెండు సినిమాలు రిలీజ్ చేసి రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టాడు. పఠాన్, జవాన్ సినిమాలు షారుఖ్ ని తిరిగి బాలీవుడ్ బాద్షాగా నిలబెట్టాయి.…